Header Banner

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

  Mon Jun 16, 2025 21:50        Politics

ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ఏపీలో ఒక బూతం ఉంది.. అది మళ్లీ లేస్తే ఎలా ఉంటుందని భయపడుతున్నారు.. నేను ఒకటే చెప్పా.. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానని చెప్పా.. రాజకీయం అంటే తమాషా కాదు.. మోసాలు, నేరాలు చేసి ఎదుటి వారి మీద వేయడం కాదు అని పేర్కొన్నారు. తెల్లారితే ఎన్నికలు అనగా బాబాయ్ ని లేపేశారు.. బాబాయ్ గుండె పోటుతో చనిపోయాడని అంటే నేనూ నమ్మాను.. ఆ రోజు నేను దోషులను అరెస్ట్ చేసి, రికార్డులను సీజ్ చేసి ఉంటే మనం ఓడిపోయే వాళ్లం కాదు అని తెలిపారు. సాయంత్రానికి గుండె పోటు కాదు.. గొడ్డలి పోటు అని తేలడంతో నాటకాల రాయుడు మాట మార్చేశాడు అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.

 

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

అయితే, బాబాయ్ ను చంపేసి సీఎం, మంత్రులపైన నెట్టేసి నారాసుర హత్య అన్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి మళ్లీ డ్రామాలు, నాటకాలు అడుతున్నారు.. కోడి కత్తి నాటకమే, గులకరాయి నాటకమే.. చివరికి ఇంటి దగ్గర మంటలు కూడా నాటకమేనని చెప్పుకొచ్చారు. ఇంట్లోని సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇవ్వరు.. పొదిలి వెళ్లాడు.. అక్కడ ఏం చేశాడని ప్రశ్నించారు. ఇప్పటికే బర్లీ, పొగాకును రూ. 12 వేలకు కొనమని చెప్పా.. అపోజిషన్ లో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఇక్కడ ఉంది సీబీఎన్.. రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసుల మీద దాడి చేస్తానంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది అని తేల్చి చెప్పారు. 1996-97లో తీవ్రవాద సమస్య, రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్ లో మత ఘర్షణలు, గల్లీకొక రౌడీ ఉంటే.. అన్నింటినీ అరికట్టాను.. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Comment on jagan #Warring #Rowdyism #Action #Opposition